21 July, 2026 | 9:07 PM

మంత్రి శ్రీధర్ బాబు మేనత్త మృతదేహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాళి

21-07-2026 06:05 PM

పెద్దపల్లి,(విజయ క్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు  సోదరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేనత్త, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య  సతీమణి స్వర్గీయ సువర్ణ వనమాల మన ఆరోగ్యంతో సోమవారం మృతి చెందగా మంగళవారం మంథని లో ఆమె చిత్రపటానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సువర్ణ వనమాల సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆమె మరణం కుటుంబానికే కాకుండా ప్రాంత ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొని  సువర్ణ వనమాలకు ఘనంగా నివాళులర్పించారు.