రూ.10 లక్షల అక్రమ మద్యం ధ్వంసం
21-07-2026 06:24 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో గతంలో వివిధ కేసులలో సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ట్రాక్టర్ తో తొక్కించి మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ గతంలో వివిధ కేసులలో సుల్తానాబాద్ పరిధిలో సీజ్ చేసిన మద్యంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రనికి చెందిన మద్యం కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన మద్యం ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు.. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ డిఎస్పి ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్, ఎస్సై చిరంజీవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






