calender_icon.png 17 July, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహహింస చట్టాలపై అవగాహన

16-07-2025 06:28:06 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో బుధవారం గృహహింస చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి ముఖ్యఅతిథిగా జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ మాట్లాడుతూ... లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, మండల మహిళలకు  గృహహింస చట్టాల పై అవగాహన కల్పించారు. మహిళా చట్టాలు, గృహహింస చట్టంపై మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు శరీరకంగా, మానసికంగా, అరికట్టాలంటే మహిళలలో చైతన్యం రావాలన్నారు. గృహహింస. దిశా చట్టం, సఖి సెంటర్, శిక్షలను వివరించారు. రాజ్యంగం ప్రసాదించిన హక్కుల గురించి తెలుసుకొని బాధ్యతతో నడుచుకుంటూ సమాజంలో మంచి పౌరులుగా రాణించలన్నారు.