17-07-2025 11:35:00 AM
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association)అవకతవకలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. మల్కాజిగిరి కోర్టు ఐదుగురు నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతించింది. దీంతో హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్, సీఈవో సునీల్, రాజేందర్, కవితను ను సీఐడీ కస్టడీకి తీసుకోనున్నారు. ఐదుగురు నిందితులను 6 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో నేటి నుంచి ఈ నెల 22 వరకు మల్కాజిగిరి కోర్టు కస్టడీకి అనుమతించింది. చర్ల పల్లి జైలు నుంచి నలుగురిని సీఐడీ కస్టడీకి తీసుకుంది. కవితను చంచల్ గూడ జైలు(Chanchalguda Jail) నుంచి కస్టడీకి తీసుకుంది. జగన్ మోహన్, ఇతరులు నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరమ్ గురువ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐడి తెలిపింది. కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు సర్దార్ దల్జీత్ సింగ్, హెచ్సీఏ అనుబంధ సభ్యులందరికీ ఒక సందేశాన్ని పంపారు. ఈ మేరకు వాయిదా పడిన వార్షిక సర్వసభ్య సమావేశం జూలై 19న ఉదయం 10.30 గంటలకు రాజీవ్ గాంధీ స్టేడియం (ఉప్పల్)లో జరుగుతుందని పేర్కొన్నారు.