calender_icon.png 17 July, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నేతలు.. నా దారికి రావాల్సిందే: ఎమ్మెల్సీ కవిత

17-07-2025 11:48:33 AM

హైదరాబాద్: తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు(BRS leaders) స్పందించలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు తన దారికి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించానని కవిత తెలిపారు. రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది కూడా తానే అన్నారు.

బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా తాను హాజరు కానని చెప్పిన రేవంత్, బనకచర్ల ప్రాజెక్టును పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించి తిరిగి వచ్చారు. ఇతర నదీ జలాల సమస్యలను కూడా పరిష్కరించాలని అన్నారు. బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని కవత ఎద్దేవా చేశారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అన్నారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర హక్కులను త్యాగం చేసినందుకు రేవంత్ రెడ్డిని(Revanth Reddy) తెలంగాణ ఎప్పటికీ క్షమించదు.. తెలంగాణ ప్రయోజనాలకు హాని కలిగించినందుకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే వారం పార్లమెంటు సమావేశాలు(Parliament sessions) జరగనున్న నేపథ్యంలో కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడానికి ముఖ్యమంత్రి అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని నేను డిమాండ్ చేస్తున్నానని కవిత పేర్కొన్నారు.