16-07-2025 06:38:30 PM
రాజాపూర్: కుక్కల దాడిలో గొర్రెల పిల్లలు కోల్పోయిన ఎర్ర మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని జిల్లా గొల్ల కురుమ సంఘం నాయకులు పేర్కొన్నారు. కుచ్చర్కల్ గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం 15 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన స్థలాన్ని బుధవారం జిల్లా కురుమ యాదవ సంఘం చైర్మన్ శాంతయ్య యాదవ్, డైరెక్టర్ కృష్ణయ్య యాదవ్ పరిశీలించారు. కుక్కల దాడిలో గొర్రెపిల్లలు మృతి చెందడం బాధాకరమని, రైతు ఎర్ర మల్లయ్య ను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం గొల్ల కురుమలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.