29 June, 2026 | 7:09 PM

రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన

17-04-2026 09:09 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ లో భాగంగా  శుక్రవారం సాయంత్రం రోడ్ సేఫ్టీ పై ఆటో డ్రైవర్లకు పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అవగాహన కల్పించడం. జరిగింది. ఇందులో భాగంగా ఎస్సై చంద్రకుమార్ మాట్లాడుతూ... గోల్డెన్ అవర్  ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రమాదం జరిగిన మొదటి గంటలో క్షతగాత్రులకు చికిత్స  అందించినట్లయితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు.  ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేయాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పై ఎస్సై చంద్రకుమార్ అవగాహన కల్పించడం జరిగింది.