17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ

17-04-2026 09:14 PM

చేగుంట/​నార్సింగి,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, నార్సింగ్ మండలం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈ జేఏసీ) పిలుపు మేరకు శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్ గ్రేసీ బాయి, ఆర్ఐ శ్రీధర్‌లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ లోపు పీఆర్సీ అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ (ఓపిఎస్) విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డుల అమలుతో పాటు వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.