06-02-2026 03:41:30 PM
చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్
సిద్దిపేట క్రైం: సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మూఢనమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ సూచించారు. చిన్నకోడూరు మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 'కనువిప్పు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మహిళా భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ పరశురాం, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.