15 April, 2026 | 2:22 AM

బీసీ హాస్టల్‌లో సమగ్ర ఆరోగ్య శిబిరం

06-02-2026 02:53 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బీసీ హాస్టల్‌ను డాక్టర్ దివ్య సందర్శించి విద్యార్థుల కోసం సమగ్ర ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. శిబిరంలో భాగంగా ప్రతి విద్యార్థిని పరిశీలించి దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, జలుబు, చర్మ సంబంధిత వ్యాధులకు తగిన వైద్యం అందించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శ్యామల, ఆశా కార్యకర్త, హెల్త్ అసిస్టెంట్ సతీష్ పాల్గొని వైద్య సేవలకు సహకరించారు.