స్టార్ట్-అప్ లీగల్ అండ్ ఎథికల్ స్టెప్స్‌పై అవగాహన
సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో సదస్సు నిర్వహణ
హైదరాబాద్, జూన్ 27(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్‌ఐఈటీ)లో ఇనిస్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) ఆధ్వర్యంలో శనివారం ‘స్టార్ట్-అప్ లీగల్ అండ్ ఎథికల్ స్టెప్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్ భరణి సేతుపాండియన్ ఎస్, ప్రొఫెసర్, ఎస్‌ఐఈటీ ముఖ్య వక్తగా పాల్గొ ని, స్టార్ట్-అప్ సంస్థల స్థాపనకు సంబంధించిన చట్టపరమైన విధానాలు, మేధోసంపత్తి హక్కులు (ఐపీఆర్), నైతిక విలువలు, వ్యా పార నియమాలు, వ్యవస్థాపకులు పాటించాల్సిన బాధ్యతలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి డాక్ట ర్ పి. శేఖర్ బాబు, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఈటీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు వినూ త్న ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం డైరెక్ట ర్ జి. భగత్, సెక్రటరీ డాక్టర్ డి. ప్రదీప్ కు మార్ మార్గదర్శకత్వంలో నిర్వహించగా, డా క్టర్ కందే శ్రీనివాస్, ఐఐసీ కోఆర్డినేటర్ సమన్వయం చేశారు.వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పా ల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






