28 June, 2026 | 1:04 AM

సత్తా చాటిన అల్ఫోర్స్ విద్యార్థులు

28-06-2026 12:00 AM

వివిధ ఒలంపియాడ్లలో ప్రశంసాపత్రాల స్వీకరణ

కొత్తపల్లి, జూన్ 27 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు వివిధ ఒలింపియాడ్లలో ప్రశంసా పత్రాలు సాధించారు. జనరల్ నాలెడ్జ్ ఒలంపియాడ్‌లో ఎస్పీ.కృష్ణచైతన్య, ఈ. లిఖిత్ కుమార్, రీజనింగ్ ఒలింపియాడ్ లో రోహిత్ చంద్ర, లిఖిత్ కుమార్, సైన్స్ ఒలంపియాడ్‌లో పి.గౌరీ, ఏ.రిషిత్ చంద్ర, ఎన్. వినాయక్, ఎన్. సహ్రస్ విజయ్ ప్రశంస ప త్రాలు సాధించారు. ఈ సందర్భంగా అల్ఫో ర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థులకు పుష్పగుచ్చాలతో పాటు పతకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులోనూ అద్భుతమైన విధానం న మోదు చేసి తల్లిదండ్రులు ఆశయాలకు అ నుగుణంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.