calender_icon.png 2 February, 2026 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఆరోగ్యంపై అవగాహన

02-02-2026 08:08:10 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలోని క్లబ్ స్వస్థ్య  కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమం ఆధ్వర్యంలో శ్రీసాయి మోడల్ హై స్కూల్, మల్లాపూర్, చర్లపల్లి లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా  ఒక స్కిట్‌ను ప్రదర్శించడంతో పాటు వివిధ ఆటలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. అలాగే నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాలను ఆధారంగా చేసుకుని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, వాటి ప్రభావాలు, అవగాహన అవసరాన్ని వివరించారు.

విద్యార్థులకు ఒత్తిడి కారణాలు, భావోద్వేగాలను వ్యక్తపరచడం యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, అవసరమైనప్పుడు సహాయం కోరడం వంటి అంశాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరణలు ఇవ్వబడాయి. ఈ కార్యక్రమాన్ని శౌర్య, అక్షయ, సత్య శ్రీకరి, చర్చిత, భవ్య, స్ఫూర్తి, సమధర్షిణి, వర్షిణి, సాత్విక్, సంకీర్తన లు సమన్వయంతో నిర్వహించారు. కోఆర్డినేటర్ డాక్టర్  సునంద్, మెంటర్ డాక్టర్ ఫర్హానా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.