calender_icon.png 2 February, 2026 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సమైక్య భవనాన్నిప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే

02-02-2026 08:05:12 PM

అడ్డాకుల: మండల కేంద్రంలో  ఏర్పాటు చేసిన మహిళా సమైక్య భవనాన్ని సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి మండల నాయకులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళల కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 10 లక్షల మహిళా సమైక్య భవనానికి కేటాయిస్తున్నట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబననే పరమావధిగా ముందుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట శ్రీహరి సర్పంచ్ దశరథరెడ్డి,, విజయ్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగర్జున రెడ్డి, జగ్గయ్య, హేమవర్ధన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వేగనాద్, రమేష్, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు