19 August, 2026 | 4:37 PM

ప్లాస్టిక్ నియంత్రిస్తేనే ప్రజలకు మేలు

19-08-2026 04:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): గ్రామాల్లో పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగించవద్దని, డీఎల్పీఓ లింగయ్య, ఎంపీడీవో సుధాకర్ అన్నారు. బుధవారం నిర్మల్ రూరల్ మండలంలోని ముక్తాపూర్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన సంవత్సరం పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడ వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వర్షాలు కురవడం లేదని తెలిపారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా గ్రామపంచాయతీ డాక్టర్ ద్వారా చెత్త డంపుకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏ రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.