19 August, 2026 | 4:57 PM

టేకులపల్లిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

19-08-2026 04:25 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని టేకులపల్లి మండల ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో బోడు రోడ్డులోని రూపా స్టూడియోలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకెస్ మండే డాగురెను స్మరించుకున్నారు. తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జెండాను మండల గౌరవ అధ్యక్షుడు అలవాల శ్రీనివాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన టెక్నిక్స్‌ను నేర్చుకుంటూ ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలని సూచించారు.

ఫోటోగ్రాఫర్ల ప్రమాద బీమా, కార్యక్రమాలకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆమెడ రవి, కార్యదర్శి నాగేశ్వరరావు, ట్రెజరర్ రవికుమార్, కుటుంబ భరోసా ఇన్‌చార్జి  సైదులు, భద్రాద్రి జిల్లా సభ్యుడు రమేష్ నాయుడు, సైదులు, నవీన్, శేషు, రవి, రమేష్, అలవాల అరుణ్, గోపి, కోరం రవీందర్, శ్రీకాంత్, శేషయ్య, విజయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.