19 August, 2026 | 5:25 PM

జమలాపురం దేవస్థానంలో కనులారా పవిత్రోత్సవాలు

19-08-2026 04:35 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): తెలంగాణ చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కనులారా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం జమలాపురం గ్రామంలో వెలసి భక్తుల పాలిట కొంగుబంగారమై కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ఉత్సవాలు ఈనెల  21 నుండి 24వ తేదీ వరకు దేవస్థానం నందు  నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె జగన్మోహన్రావు పేర్కొన్నారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం శాకంబరి ఉత్సవ సహిత పవిత్ర ఉత్సవములు వైభవంగా నిర్వహిస్తామని 21వ తేదీన శ్రీవారికి సర్వాంగభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామని, 22వ తేదీన యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, 23వ తేదీన ప్రాతక్కాల అర్చనలు, మండపారాధనలు హోమాలు, బలిహరణ, ప్రత్యేక పూజలు, 24వ తేదీన మండపారాధనలు ప్రత్యేక పూజలు, హోమాలు, పవిత్రోత్సవం విసర్జన, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ ఈవో పేర్కొన్నారు. దేవస్థానంలో జరిగే కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు.