తప్పిన పెను ప్రమాదం
19-08-2026 04:13 PM
నిర్మల్,ఆగస్టు 19 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం న్యూలోలం గ్రామ సమీపంలో బుధవారం కారు లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గుండంపెల్లి గ్రామం నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారును బైంసా నుంచి నిర్మల్ వైపు వస్తున్న మరో కారు ఓవర్ టేక్ కు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఎదురుగా నిర్మల్ నుంచి బైంసా వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన లారీ రోడ్డుకు ఎడమ వైపునకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న నర్సాపూర్ పోలీసులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.






