19 August, 2026 | 5:25 PM

జానీ మాస్టర్‌కు ఊహించని షాక్.. సస్పెన్షన్ కంటిన్యూ!

19-08-2026 04:28 PM

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం(Telugu Film Federation Emergency meeting) జరిగింది. 23 శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశానికి హాజరయ్యారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై ఫెడరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ కు ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం ఉండదని ఫెడరేషన్‌ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్(Federation President Vallabhaneni Anil) స్పష్టం చేశారు. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సస్పెన్షన్ కొనసాగుతోందని వల్లభనేని పేర్కొన్నారు. జానీ మాస్టర్ ఫెడరేషన్ కు ఇచ్చిన రూ. 3 లక్షలు తిరిగి పంపిస్తామని సూచించారు. డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కి తప్ప మిగతా 24 క్రాఫ్ట్స్‌కి మా మద్దతు ఉంటుందని ఫెడరేషన్‌ ప్రెసిడెంట్ అనిల్ స్పష్టం చేశారు.