calender_icon.png 6 December, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: పాలకుర్తి శ్రీకాంత్

06-12-2025 07:23:43 PM

నూతనకల్,(విజయక్రాంతి): ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల అధికారుల ఆదేశాల మేరకు శనివారం మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ... ప్రజలకు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం అని అన్నారు.

పారదర్శక పాలన కావాలన్నా, మంచి నాయకులు పరిపాలించాలన్న రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతోనే  సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి జిల్లా టీం లీడర్ పల్లెల లక్ష్మణ్, గంట బిక్షపతి, గడ్డం ఉదయ్, పల్లెల రాము, మాగి శంకర్, పాక ఉపేందర్, మద్దిరాల మంజుల, ములకలపల్లి మల్లమ్మ, కుందమల్ల నాగలక్ష్మి, సిరిపాంగి రాధ, గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.