06-12-2025 07:21:50 PM
ఉప సర్పంచ్ గా కేతావత్ రూక్కి బాబు ఏకగ్రీవ ఎన్నిక..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండా సర్పంచ్ పదవికి ఎస్టీ జనరల్ రిజర్వేషన్ రావడంతో తండావాసులు అందరు కలిసి తండాకు చెందిన గుగులోత్ శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఒకే ఒక నామినేషన్ దాఖలు చేసే విధంగా గ్రామస్తులు తీర్మానం చేయడం జరిగింది. దీంతో ఎవరు సర్పంచ్ అభ్యర్థికి పోటీ లేకపోవడంతో తాండవాసులు ఎన్నికల అధికారులు శ్రీనివాసుని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించడం జరిగింది.
అదేవిధంగా ఉప సర్పంచ్ గా తాండాకు చెందిన కేతావత్ రూక్కి బాబును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వార్డు సభ్యులు అందరూ కూడా ఒకే ఒక నామినేషన్ రావడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తండావాసులు తెలిపారు. తనపై నమ్మకంతో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తాండావాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తండాలోని శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తండాలో ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజల సమస్యలున్న ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన తెలిపారు.