అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
16-03-2026 05:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదం జరిగినప్పుడు చేపట్టవలసిన చర్యలపై సోమవారం ఎన్డిఆర్ఎఫ్ అవగాహన కల్పించారు. 26 జిల్లా అధికారి మధుమోహన్ పరిశ్రమల శాఖ అధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రమాదాలు జరగకుండా చేపట్టవలసిన చర్యల పై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్ డి ఆర్ ఎఫ్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. సిబ్బంది లక్ష్మణ్ కుమార్ కేదార్నాథ్ ఫ్యాక్టరీ డైరెక్టర్ కృష్ణ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




