16 March, 2026 | 7:05 PM

అంగన్వాడి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

16-03-2026 05:51 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న అంగన్వాడి నూతన భవనానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల పోషణ, గర్భిణీలు, బాలింతల సంక్షేమానికి ఎంతో కీలకంగా ఉంటాయని తెలిపారు.

కొత్త భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత పిల్లలకు, మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిర్యాల్కర్ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఫాష, ఎంఈఓ మురళి నాయక్, ఉపసర్పంచ్ వెలిచాలా శ్రీనివాస్,కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.