3 June, 2026 | 8:18 PM

నారి శక్తి పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన

03-06-2026 07:42 PM

కుబీర్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ నాయకత్వంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న “నారి శక్తి” కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా మరింత ప్రభావవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, వచ్చిన డయల్ 100 కాల్స్‌కు తక్షణ స్పందన అందించి బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించారు. ఇందులో భాగంగా నిర్మల్ పట్టణం లో వచ్చిన డయల్ 100 కి తక్షణ స్పందన అందించి సమస్యను పరిష్కరించారు.

వీటితో పాటు గ్రామాల్లోని ప్రజలకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు, అంతేకాకుండా ప్రజలకు మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల సంభవించే ప్రమాదాల గురించి వివరించారు. అనంతరం నారిశక్తులు వాహన తనిఖీలు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.ఈ "నారి శక్తి" కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.