13 March, 2026 | 7:25 PM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

13-03-2026 06:12 PM

రోడ్డు భద్రత, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజాపాలన–ప్రగత ప్రణాళిక కార్యక్రమాల్లో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

రామగుండం,(విజయ క్రాంతి): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా పిల్లల భద్రత, “మత్తు పదార్థాల వినియోగం–అనర్థాలు”, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని 1-టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ... మత్తు పదార్థాలకు బానిసలైతే ఎవరి భవిష్యత్తైనా నాశనం అవుతుందని, ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని తమ ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. 

అలాగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువతలోనే జరుగుతున్నాయని,  నివేదికల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం వరకు యువకులే బాధితులవుతున్నారని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు. సైబర్ నేరాల విషయంలో కూడా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు అడగడం, అనుమానాస్పద లింకులు పంపడం వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మొబైల్ ఫోన్ ద్వారా ప్రపంచంతో అనుసంధానం సాధ్యమవుతున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ నేరస్థులకు కూడా అవకాశం కలుగుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని,      ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్, 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ప్రవచనకర్త ఎస్.పి. నాయక్ బంజారా,  ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, 1-టౌన్ ఎస్‌ఐలు రమేష్, అనూష, పోలీస్ సిబ్బంది  సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.