10 July, 2026 | 8:55 PM

Breaking News

గుల్పర్తిలో సిగ్నల్ వ్యాధులపై అవగాహన

10-07-2026 07:16 PM

మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు..

రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ని 7వ వార్డు గొలిపర్తి గ్రామం లో సీజనల్ వ్యాధులు గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా గతంలో గొలిపర్తి గ్రామంలో 4 గురు డెంగ్యూ మలేరియా వ్యాధి బారిన పడ్డారు. కాబట్టి ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు. ముఖ్యంగా డాక్టర్స్ మరియు చైర్మన్  మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటిలో నిల్వ ఉన్న కుండీలు, ఏవైనా పాత టైర్స్, ఇంకేమన్న పాత వస్తువులు ఉన్న తీసివేయాలని అన్నారు. అలాగే రోడ్డు పై గుంతలు పడి నీరు నిల్వ ఉన్నట్లయితే మున్సిపల్ ఆఫీస్ కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు తో పాటు కౌన్సిలర్లు ఉన్నారు.