28 August, 2026 | 7:56 PM

Breaking News

విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •  

శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో రాఖీ వేడుకలు

28-08-2026 06:24 PM

ఆలయ కమిటీ ఛైర్మెన్ నాగపురి సమ్మయ్య గౌడ్ కు రాఖీ కట్టిన మహిళలు 

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం రాఖీ వేడుకలు ఆలయ కమిటీ ఛైర్మెన్ నాగపురి సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలలో భూపాలపల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు రేణుక, ఆలయ డైరెక్టర్ కోమల, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్ పరమేశ్వరి పాల్గొని సమ్మయ్య గౌడ్ తో పాటు పలువురు నాయకులకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, బౌతు రాజేష్, ఎస్ కె అజాజ్, దేవర రాము, పాపడాల రాము, ఆలయ డైరెక్టర్ రమణాచారి, శ్రీనివాస్, బాలాజీ, రవి, వెంకటస్వామి, అర్చకులు రాధాకృష్ణ, మురళీకృష్ణ, ఈఒ మహేష్ తదితరులు పాల్గొన్నారు.