8 June, 2026 | 11:04 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం

08-06-2026 09:46 PM

మన ఆరోగ్యం మన చేతుల్లోనే Dr తుకారాం రాథోడ్ DMHO

కొత్తగూడెం,(విజయ క్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా UPHC రామవరం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్  (DMHO) ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజారోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు. డాక్టర్ తుకారాం రాథోడ్  మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అనేవి సమాజ ఆరోగ్యానికి అత్యంత కీలకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ ఆరోగ్య దినోత్సవాల ప్రాముఖ్యతపై కూడా అవగాహన కల్పించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ మెదడు కణితులు (Brain Tumours) దినోత్సవం

ప్రపంచ సముద్రాల దినోత్సవం

అలాగే “RRR – Reduce, Reuse, Recycle” ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. Anti Malaria Month ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా ఉంచుకోవాలని,ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే పాటించాలని, కూలర్లు, కుండ పెంకులు, ఫ్రిజ్ , టైర్లు , కొబ్బరి బోండాలు ప్లాస్టిక్ కవర్లు,  రోళ్ళు , ఖాళీ సీసాలు, పగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బులు, పూల కుండీలు మొదలగు వాటిలో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది.

దోమ కాటువలన మలేరియా , డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు, మెదడువాపు ,మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు చిన్న దోమ కాటు వలన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని ఇంటి పరిసర ప్రాంతాల్లో పనికిరాని వస్తువులను తీసివేయాలని నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, నీటి గుంటలలో కిరోసిన్ , బండి ఆయిల్ మొదలైనవి వేసుకోనుట ద్వారా దోమ పిల్లలు పెరగకుండా నివారించవచ్చని తెలియజేశారు , వర్షాకాలంలో నీరు నిలువ లేకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని తెలియజేశారు , Anti Diarrhoea Month బాగంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు.

మరుగుదొడ్లను వాడిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పాలిచ్చే తల్లులు వంట చేసే వారు చేతులను శుభ్రంగా కడుకోవాలని తెలియజేశారు , చేతి గోర్లను తరచుగా కత్తిరించుకోవాలని నోటిలో పెట్టి కత్తిరించడం మానుకోవాలని తెలియజేశారు.చేతుల శుభ్రం లేకపోవడం వలన అనేక అంటూ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు,  ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఎవరికైనా డయేరియా లక్షణాలు కల్పించినట్లయితే జింక్ మరియు ఓఆర్ఎస్ పాకెట్స్ అందించి దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయం తీసుకోవాలని తెలియజేశారు , 14 సంవత్సరాల వయసు కిశోర బాలికలకు 

HPV టీకా (HPV Vaccine) ప్రాముఖ్యతను వివరించి, సకాలంలో టీకాలు తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అర్హులైన బాలికలకు అందరికీ HPV వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తుకారాం రాథోడ్ UPHC రామవరం నందు మొక్క నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ మొక్కలు నాటారు. “మన ఆరోగ్యం మరియు పర్యావరణ ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది.” “ఆరోగ్యకరమైన పర్యావరణం – ఆరోగ్యకరమైన జీవితం”. “Reduce, Reuse, Recycle – ప్లాస్టిక్‌ను తగ్గిద్దాం, భవిష్యత్తును కాపాడుదాం”.