17 April, 2026 | 10:05 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన

17-04-2026 08:26 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): అరైవ్-అలైవ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా గోపాల్పేట్ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాబట్టి సమయం వృధా చేయకుండా గోల్డెన్ అవర్స్ లోపు బాధితులను ఆస్పత్రికి తరలించవలసిన అవసరాన్ని ప్రజలకు, ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి వివరించడం జరిగిందన్నారు.

అలాగే రాంగ్ వేర్ స్కీమ్ గురించి తెలియజేస్తూ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని గోల్డెన్ అవర్స్ లోపు ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం 25000 నగదు ప్రోత్సాహం అందిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారు సృజన్ కుమార్ పాల్గొని సిఅర్పి మరియు ఫస్ట్ ఎయిడ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.