17 April, 2026 | 9:38 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ

17-04-2026 08:22 PM

వేములపల్లి,(విజయక్రాంతి): మా పట్టా భూమిలో అధికారులు ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు అని పుట్టా వెంకటమ్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బుగ్గవాయిగూడెం గ్రామంలో అధికారులు గ్రామపంచాయతీ నిర్మాణ పనులను మొదలు పెడుతుండడంతో ఆమె అడ్డుకొని మాట్లాడారు. మాకు 177 సర్వే నెంబర్లో 11 గుంటల భూమి ఉన్నది ఇట్టి భూమికి పట్టాను కూడా పొందాము. గత 30, 35 సంవత్సరాలుగా కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్నామన్నారు. మేము కబ్జా ఉన్న భూమిలో ఇది 104 సర్వే నెంబర్ కు సంబంధించింది అని స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు మాపై రాజకీయ కక్షతో మా పట్టా భూమిలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు 206 207 సర్వే నెంబర్లలో ఉన్న 16 గుంటల ప్రభుత్వ భూమిలో గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. అట్టి భూమిలో గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టకుండా గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమి ఉన్నప్పటికీ మా భూమిలోనే గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని అధికారులతో కుమ్మక్కై మా భూమి లోనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కి, కాంగ్రెస్ నాయకులకు సరికాదని ఆమె వాపోయారు. ఇప్పటికైనా ఎవరు కబ్జాలో లేని భూములను గుర్తించి అట్టి భూమిలో గ్రామపంచాయతీ నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను కోరారు.