క్రీసెంట్ హైస్కూల్లో డ్రగ్స్‌పై నిర్మూలనపై అవగాహన
25-05-2026 01:35 AM
బోధన్ మే 24 (విజయక్రాంతి): బోధన్ మే 24 : బోధన్ పట్టణంలోని కిసెంట్ హైస్కూల్లో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యు సి ఐ డి ప్రెసిడెంట్ తస్కిన్ అహ్మద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని దీని ద్వారా ఏర్పడే మానసికంగా ఆరోగ్యంగా దుష్ప్రభావాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ సిఐ వెంకటనారాయణ నార్కో టీం సందీప్, క్రిసెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ జావిద్, యూనిస్ అహ్మ ద్ షేక్ ముకోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






