10 August, 2026 | 3:55 PM

మలేరియాపై అప్రమత్తం

10-08-2026 02:54 PM

- గుత్తికోయ గ్రామాల్లో IRS స్ప్రేయింగ్

- దోమల నియంత్రణకు ఇళ్లలో ఆల్ఫా సైపర్‌మెత్రిన్ పిచికారీ

టేకులపల్లి,(విజయక్రాంతి): జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి, భద్రాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్, సులానగర్ పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ ఆదేశాల మేరకు సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మలేరియా ప్రభావిత గుత్తికోయ గ్రామాల్లో మలేరియా నివారణ చర్యలు చేపట్టారు. మొట్లగూడెం, సిద్దారం, నాగారపుజోగు గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ (IRS) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా ఇళ్ల లోపలి గోడలపై నిబంధనల ప్రకారం ఆల్ఫా సైపర్‌మెత్రిన్ మందును పిచికారీ చేశారు. ఈ మందు దోమల నియంత్రణకు, తద్వారా మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు సహాయపడుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రజలు సహకరించాలి మలేరియా నివారణలో భాగంగా ఆరోగ్య సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు కోరారు.

ఇళ్లలో స్ప్రేయింగ్ చేసేందుకు వచ్చే సిబ్బందికి సహకరించడంతో పాటు దోమతెరలను తప్పనిసరిగా వినియోగించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి ఉచిత మలేరియా పరీక్ష చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.