10 April, 2026 | 2:53 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుపై అవగాహన సదస్సు

08-11-2025 12:00 AM

హనుమకొండ టౌన్, నవంబర్ 7 (విజయక్రాంతి): హనుమకొండ  57వ డివిజన్ లో అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  ప్రసన్నాంజనేయ దేవాలయంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు అవగాహన సదస్సును నిర్వాహిచారు. అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  శ్రీ ప్రసన్న  ఆంజనేయ స్వామి దేవాలయంలో కాలనీవాసుల కోసం ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ కార్యక్రమానికి సమ్మయ్య నగర్ పిహెచ్సి డాక్టర్ హైదర్, ఏఎన్‌ఎం శ్రీదేవి, ఆశా వర్కర్లు విజయలక్ష్మిలు అశోక కాలనీ వాసులకు అవగాహన  కల్పించినారు. అనంతరం అధ్యక్షులు మండల కృష్ణారెడ్డి మట్లాడుతు  కాలనీ లోని ప్రతి సభ్యులు ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ప్రతి ఇంటికి ఏఎన్‌ఎం వచ్చినచో ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీ ఇవ్వాలని, పూర్తి ఆరోగ్య సమస్యలు తెలుపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక కాలనీ అభివృద్ధి  కమిటీ  ప్రధాన కార్యదర్శి బూర రాంచందర్, ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి భగవాన్ రెడ్డి, మల్లేశం, దేవాలయ కమిటీ అధ్యక్ష , కార్యదర్శులు చింత శ్రీనివాసు, సరోత్తం రెడ్డి, కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులుపాల్గొన్నారు.