08-11-2025 12:00:00 AM
బాచారం, బండ రావిరాలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
అబ్దుల్లాపూర్ మెట్, నవంబర్ 7 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అదనం కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు. శుక్ర వారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలం లోని బాచారం, బండ రావిర్యాల పీసీసీ సెంటర్ లను సందర్శించి, కొనసాగుతున్న వరి సేకరణ కార్యక్రమాలను ప్రత్యక్షంగా సమీక్షించారు.
తనిఖీ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సేకరించిన వరిధాన్యాన్ని నిర్ణీత తేమ స్థాయికి చేరుకున్న వెంటనే రైస్ మిల్లులకు తరలించాలనీ, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని, మిల్లర్ రసీదులు సకాలంలో అందేలా చూడాలని, తద్వారా రైతులకు కొనుగోలు చేసిన 48 గంటలలోపే చెల్లింపులు జరగాలనీ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా చూసుకోవాలి అని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లర్లకు పంపించాలని, తూకం వేసి మిషన్లు, గన్ని బ్యాగులను టార్ఫాలిన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లి లోని జయలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేసారు. CSO వనజాత, ౄMO హరీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.