08-11-2025 12:00:00 AM
శంకర్ పల్లి, నవంబర్ 7( విజయ క్రాంతి): గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు తర వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, లబ్ధిదారులు అంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం పర్వేద గ్రామపంచాయతీలో గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన ప్రతి ఒక్కరూ త్వరతి గతిన ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కోసం తన వంతు సహాయంగా ప్రతి లబ్ధిదారునికి 25 సంచుల సిమెంట్ ఉచితంగా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రెండవ విడుతలో కొత్తగా మంజూరైన 16 మందికి ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఎంపీడీవో అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ , మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.