08-12-2025 06:00:48 PM
లక్షెట్‌పేట (విజయక్రాంతి): మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ హాజరై పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ గ్రామంలో పలువురు ఇబ్బంది చేసిన, అల్లారలకు పలుపడే వారిని బైండ్ ఓవర్ చేశామని అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, ప్రతి ఓటు మన గ్రామానికి ఎంతో బలమని అన్నారు.
అక్రమాలకూ, డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఓటరు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. స్వచ్ఛమైన, న్యాయబద్ధమైన ఎన్నికలతో మంచి నాయకత్వం ఏర్పడతుందని అన్నారు. అలాగే గ్రామస్థులు ఎన్నికల సమయంలో శాంతి భద్రతా నియమాలను పాటించాలని, అధికారులు, పోలీసులు అందరూ ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ ఎన్నికల, సీఐ రమణమూర్తి, ఎస్ఐ గొపతి సురేష్, పోలీస్ సిబ్బంది అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.