7 March, 2026 | 1:43 PM

ఐఐఎంసీ కళాశాలలో ప్రాజెక్ట్ వర్క్ పై అవగాహన సదస్సు

06-03-2026 02:24 AM

52 కాలేజీల నుంచి 1102 పైగా పాల్గొన్న విద్యార్థులు

ఖైరతాబాద్, మార్చి 5(విజయక్రాంతి): భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పరిశోధనా ప్రాజెక్టుల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేప థ్యంలో విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ (ఐఐఎంసీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపీఈ) సంయుక్తంగా ప్రాజెక్ట్ వర్క్ గైడెన్స్ అనే అంతర కళాశాలల విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాన్ని కళాశాలలోని చల్లా సోమ్ రాజ్ రామ్ సభా ప్రాంగణంలో గురువారం సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 52 కళాశాలల నుంచి 1102 పైగా విద్యార్థు లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం విద్యార్థులకు పరిశోధన విధానాల ప్రాథమిక అంశాలను పరిచయం చేయడం, పరిశోధనా ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూ ర్తి చేయడానికి అనుసరించాల్సిన విధానాలను వివరించడం. ముఖ్యంగా ఫైనల్ ఇ యర్ యూజీ మరియు పీజీ విద్యార్థులకు ప్రాజెక్ట్ పనిలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి అవసరమైన జ్ఞానం, మార్గదర్శకత్వం ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ముందుగా అతిథులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనం తరం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు పాట్రిక్ రాసిన ‘సంగ్రహణ పరిశోధన ప్రాజెక్టు వర్క్ పుస్తకం’ను శ్రీనివాసమూర్తి  ఆవిష్కరించారు.

సభాధ్యక్షులు ఐఐఎంసీ కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనా థం మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ ద్వారా ఆచరణాత్మక జ్ఞానం పొందవచ్చని తెలిపారు. ఐపీఈ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధనలో ప్రణాళిక, క్రమశిక్షణ మరియు స్పష్టమైన ల క్ష్యం ఎంత ముఖ్యమో వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభా గం, ఆచార్యులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఎ పాట్రిక్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థుల ఆలోచనా శక్తిని అభివృద్ధి చేస్తుందని అన్నారు.

కళాశాలప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌ను కేవలం ఒక అకడమిక్ అవసరంగా కాకుండా నేర్చుకునే అవకాశంగా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూని వర్సిటీకి చెందిన కామర్స్, మేనేజ్‌మెంట్ విభాగంలోని ప్రముఖ అధ్యాపకులు పాల్గొన్నారు. వారిలో ప్రొఫెసర్ ఏ పాట్రిక్ (చైర్మ న్, బోర్డ్ ఆఫ్ స్టడీస్), ప్రొఫెసర్ టి కృష్ణ కుమార్, ప్రొఫెసర్ కె  నరేంద్రనాథ్, ప్రొఫెసర్ ఎస్‌వీ సత్యనారాయణ, సీనియర్ ప్రొఫె సర్ ప్రశాంత ఆత్మ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ప్రొఫెసర్ వై రామకృష్ణ, ప్రొఫెసర్ కేవీ అనంత కుమార్, ప్రొఫెసర్ పద్మాకర్ జాధవ్, డాక్టర్ ఎం  చంద్రశేఖర్, డాక్టర్ రాజేష్ గంగాఖెడ్కర్, డాక్టర్ వసంతి దోంతి, డాక్టర్ ప్రార్థనా కు మార్ వంటి నిపుణులు తమ విలువైన సూ చనలు అందించారు.