31 July, 2026 | 1:27 AM

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన సదస్సు..

31-07-2026 12:44 AM

గాంధారి, జూలై 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం గ్రామంలో గ్రామ సర్పంచ్ సోలంకి ప్రమోద మాధవరావ్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమోద మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, గ్రామంలో కుల వివక్షకు తావులేదని అన్నారు.. అందరూ కలిసి మెలిసి ఉండి గ్రామ ప్రగతికి పాటుపడాలని ఆమె అన్నారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ యువరాజ్, ఎఎస్‌ఐ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోలంకి మాధవరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..