18 July, 2026 | 1:30 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

మిషన్ భగీరథ నీటి నాణ్యతపై అవగాహన సదస్సు

16-05-2026 08:48 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండ‌ల కేంద్రంలో మిషన్ భగీరథ(ఇంట్రా) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరబ్రహ్మదేవ్, మండల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిశోర్ ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన శనివారం నీటి నాణ్యత పరీక్షల ప్రయోగశాల సిబ్బంది అహ్మ‌ద్‌పాషా, వెంకట్ మహరాజు మిషన్ భగీరథ నీటి నాణ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు భూగర్భ జలాలు, మినరల్ వాటర్, మిషన్ భగీరథ నీటికి సంబంధించి వ్యత్యాసాలు, తేడాలు వివరించి వారిలో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వం సరఫరా చేసే మిషన్ భగీరథ నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బర్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.