18 July, 2026 | 1:04 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

‘బుడుబవై’ సందడి

16-05-2026 08:51 PM

అమావాస్య సందర్భంగా ఆదివాసీ చిన్నారుల ఆటపాటలు

సిరికొండ,(విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకుని సిరికొండ మండలంలోని కోసు పటేల్‌గూడలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక ఆదివాసీ సంప్రదాయం ప్రకారం చిన్నారులు ‘‘బుడుబవై… కుకూ…’’ అంటూ సందడి చేశారు. కప్పతల్లిని రోకాలి(హాకా)తో కట్టి ప్రతి ఇంటికీ తిరుగుతూ పెద్దలకు బొట్టు పెట్టి ఆశీర్వాదాలు పొందారు. నీటితో స్నానం చేసి గ్రామమంతా ఎగురుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ మురిసిపోయారు. ప్రతి ఆదివాసీ గిరిజన గ్రామంలో అమావాస్య రోజు ప్రత్యేకంగా నిర్వహించే ఈ సంప్రదాయ కార్యక్రమం కోసు పటేల్‌గూడలో హర్షోల్లాసంగా సాగింది. గ్రామస్తులు పిల్లల్ని అభినందిస్తూ సంప్రదాయ సంస్కృతి అలానే కొనసాగాలని ఆకాంక్షించారు.