రైఫీల్ షూటింగ్ లో సత్తా చాటిన అయ్మాన్ ముస్కాన్ పఠాన్
గోల్డ్ మెడల్‌తో సత్తా చాటిన ముస్కాన్
కొత్తగూడెం;(విజయక్రాంతి): గ్రామీణ క్రీడా ప్రతిభకు చారిత్రాత్మక విజయంగా, జూనియర్ షూటర్ అయ్మాన్ ముస్కాన్ పఠాన్ 2వ తెలంగాణ సూపర్ బిగ్ బోర్ పోటీలు – 2026లో బంగారు పతకం సాధించారు. ఆమె 100కి 98 పాయింట్లు సాధించి, మొత్తం పోటీల్లోనే అత్యధిక స్కోర్ నమోదు చేశారు. ఈ విజయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. సూపర్ బిగ్ బోర్ రైఫిల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తొలి పతకం దక్కింది.
తెలంగాణ రైఫిల్ సంఘం ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 20, 21 తేదీల్లో ఈ పోటీలను హైదరాబాదులో ఆక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. అయ్మాన్ ముస్కాన్ పఠాన్, బంగారు పతకాన్ని మాజీ డీజీపీ అంజనీ కుమార్, తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు, జాతీయ రైఫిల్ సంఘం ఉపాధ్యక్షుడు అమిత్ సంఘీ చేతుల మీదుగా అందుకున్నారు.






