హైదరాబాద్ తొలి హిందూ కోత్వాల్ శ్రీరాజ బహదూర్ వెంకటరామారెడ్డి జయంతి వేడుకలు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): హైదరాబాద్ తొలి హిందూ కోత్వాల్ శ్రీరాజ బహదూర్ వెంకటరామారెడ్డి 157వ జయంతి వేడుకలను ఘట్కేసర్ రెడ్డి సంఘం భవనంలో సంఘం అధ్యక్షులు చందుపట్ల వెంకట్ రెడ్డి అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో మొదటి హిందూ కోత్వాల్ గా సేవలందించిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం రాజా బహదూర్ అనే బిరుదు ప్రకటించింది.
వారు పోలీస్ సంస్కరణలు, సామాజిక సేవలు, విద్య సేవలు, పేద విద్యార్థులకు హాస్టళ్ళు, వారు చేసిన సామాజిక తదితర అంశాలపై వారి చరిత్ర గురించి నాయకులందరూ ప్రసంగించి వారిని స్మరించుకోవడం జరిగింది. వారి సేవలను అన్ని వర్గాలకు వారి భావితరాలకు తెలియపరచాలని సంకల్పంతో సంఘ సభ్యులందరూ ప్రసంగించడం జరిగింది. తదుపరి ఈరెడ్డి సంఘం 21 మంది సభ్యులు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి, రూపారెడ్డి, మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు.
అతి త్వరలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని దీనికి ప్రతి ఒక్కరు కృషి చేస్తామని వారి సహాయ సహకారాలు అందిస్తామని స్వచ్ఛందంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ ముఖ్య సలహాదారులు సింగిరెడ్డి రాంరెడ్డి, మారం లక్ష్మారెడ్డి, కొమ్మిడి రాఘవరెడ్డి, సంఘం మాజీ అధ్యక్షులు కొంతం రాంరెడ్డి, కట్ట జనార్దన్ రెడ్డి, సంఘం కోశాధికారి పాటి మహిపాల్ రెడ్డి, సంగం ఉపాధ్యక్షులు పలుగుల శ్రీకాంత్ రెడ్డి, సుడి శ్రీకాంత్ రెడ్డి, సంగం సంయుక్త కార్యదర్శి కంభం లక్ష్మారెడ్డి, కార్యవర్గ సభ్యులు గడీల రామచంద్రారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, బిరెడ్డి రవీందర్ రెడ్డి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.






