22 August, 2026 | 11:43 PM

Breaking News

సేవే లక్ష్యంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు

22-08-2026 10:54 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు చెన్నూర్ పట్టణంలో సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి. శనివారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ, మెగా యూత్ ఫోర్స్ మంచిర్యాల్ జిల్లా అధ్యక్షుడు సిద్ధూ ఆధ్వర్యంలో తెలంగాణ మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ కసరాజు పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేద ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. చిరంజీవి చూపిన సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.