22 August, 2026 | 11:43 PM

Breaking News

అంతరిక్ష సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన

22-08-2026 10:55 PM

బీవీఆర్‌ఐటీలో ఘనంగా చంద్రప్రస్థాన్–2026

నర్సాపూర్: జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సాపూర్‌లోని బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ‘చంద్రప్రస్థాన్–2026’ కార్యక్రమాన్ని రెండు రోజులపాటు నిర్వహించారు. విద్యార్థుల్లో అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, గ్రహాల అన్వేషణపై ఆసక్తి పెంపొందించడ మే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు సాంకేతిక క్విజ్‌లు, విజువల్ ఛాలెంజ్‌లు, స్వయంచాలక గ్రహ ల్యాండర్ నమూనా తయారీ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

రెండో రోజు హైదరాబాద్‌ లోని, ఐ ఎన్ సి ఓ ఐ ఎస్, శాస్త్రవేత్త డా. వెంకట్ శేషు ‘సముద్రాలు, వాతావరణం, జీవం మధ్య పరస్పర సంబంధాలు’ అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతు లు అందజేశారు. అనంతరం శాస్త్రీయ ఆలోచన, సాంకేతిక నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ బాపిరాజు, విభాగాధిపతులు, ఏవోలు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.