calender_icon.png 19 February, 2026 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్, కార్పొరేటర్లకు అయ్యప్ప భక్తుల సన్మానం

19-02-2026 01:10:47 AM

నస్పూర్, ఫిబ్రవరి 18: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన ధర్ని మధుకర్ తో పాటు నస్పూర్ ఏరియా కార్పొరేటర్లను నస్పూర్, శ్రీరాంపూర్ అయ్యప్ప సేవా సమితి భక్తులు ఘనంగా సన్మానించారు.

బుధవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో నస్పూర్ శ్రీ అయ్యప్ప సేవా సమితి గౌరవ అధ్యక్షుడు పేరం రమేష్, అధ్యక్షుడు వజ్రవేళు, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవా సన్నిదానం అధ్యక్షుడు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, ఉపాధ్యక్షుడు రాజేందర్‌లు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్‌తో పాటు కార్పొరేటర్లు రాణి రాజు,గోపాల్ రావు, స్వప్న తిరుపతి, రవిందర్, కుమారస్వామి, శ్రీలత రాజమౌళి, రజిత శ్రీనివాస్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో నస్పూర్ శ్రీ అయ్యప్ప సేవా సమితి ఉపాధ్యక్షుడు మర్రి మొగిళి, కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యర్శి సాంబశివ, కోశాధికారి రాజేందర్, శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవా సన్నిదానం ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం, కార్యదర్శి రాజశ్రీ మధు, ఉపాధ్యక్షుడు పడాల లింగయ్య, రంజిత్ పాల్గొన్నారు.