calender_icon.png 7 December, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప మాలధారుడి పట్ల దారుణం

07-12-2025 12:00:00 AM

-కళాశాలలోకి అనుమతించని యాజమాన్యం

-అయ్యప్ప మాల, దుస్తులు తీయించిన సిబ్బంది

-బీజేవైఎం, విద్యార్థి సంఘాల ధర్నా

-పోచారంలోని నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన

ఘట్ కేసర్, డిసెంబర్ 6 (విజయక్రాంతి):అయ్యప్ప మాలధారణలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని పట్ల ఓ కాలేజీ యాజమాన్యం దారుణంగా వ్యవహరించిం ది. దీక్షలో ఉన్న దుస్తులను తీసివేసి యూనిఫామ్ వేసుకొని వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆ విద్యార్థి కాలేజీ యూనిఫామ్ ధరించి పరీక్ష రాశారు. విషయం తెలుసుకున్న హిం దూ సంఘాలు ఆ కళాశాల ఎదుట పెద్ద ఎత్తునఆందోళన నిర్వహించాయి.

ఈ ఘ టన జీహెచ్‌ఎంసీ పోచారం సర్కిల్ పరిధిలోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో జరిగింది. యాదగిరిగుట్టకు చెందిన చం దు నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. శుక్రవారం అయ్యప్ప మాల ధరించి కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చాడు.కాలేజీ సిబ్బంది మాల, దుస్తులు తీసి యూనిఫాం ధరించి రావాలని ఆదేశించారు. అయినా వినకపోవడంతో బలవంతంగా అయ్యప్ప మాల దుస్తులు తీయించి యూనిఫాం వే యించినట్లు బాధితుడు చందు ఆరోపించారు.

ఈ ఘటనపై బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. విద్యార్థి పట్ల అవమానకరంగా వ్యవహరించారని శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో క ళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు కళాశాల యాజమాన్యం క్షమాపణలు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాయకులు బస్వ రాజుగౌడ్, గొంగళ్ళ బాలే ష్, ప్రభంజన్ గౌడ్ పాల్గొన్నారు.