calender_icon.png 7 December, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర విత్తన చట్టం.. క్లారిటీ లేదు

07-12-2025 12:00:00 AM

-రైతులకు మద్దతుగా ఉండాలి

-మార్పులు, చేర్పులు చేయాలి

-రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రా ంతి): కేంద్రం తెస్తున్న విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదని, మల్టీనేషనల్ విత్తన కంపెనీల కోసమే అన్నట్లుగా ఉందని, సీడ్ కంపెనీలు కూడా ఇదే విష యం చెప్పాయని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. కేంద్రంతెస్తున్న విత్తన చట్టం, ముసాయిదాలోని అంశాలపై కమిషన్ సభ్యులు, సీడ్ కం పెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో శనివారం సమీ క్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలోనే విత్తనోత్పత్తికి తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచదేశా లకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతోందని, కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో మా ర్పులు చేర్పులు చేయాలని కోరారు. తెలంగాణలో విత్తన కంపెనీల తీరు కూడా బాగా లేదని సమావేశంలో చర్చకు వచ్చిందని తెలిపారు. అయితే సీడ్ కంపెనీలు వాటి లోపాలను సవరించుకుంటామని తెలిపాయని కోదండరెడ్డి పేర్కొన్నారు. ఆర్గనైజర్ల వ్యవస్థ వల్ల రైతులకు కంపెనీలకు కూడా నష్టమేనని పేర్కొన్నారు. నకిలీ విత్తనం విషయంలో రైతులకు నష్టపరిహారం అందించాలని, ఈ విషయం కేంద్రం తెస్తున్న చట్టంలో క్లారిటీ లేదని వెల్లడించారు.