calender_icon.png 7 December, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులో పాలిటెక్నిక్ విద్యార్థి గల్లంతు

07-12-2025 12:00:00 AM

-స్నానానికి వెళ్లి మునిగిపోవడంతో ఘటన

-అచూకీ కోసం గాలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు

మహబూబాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా అనంతద్రి జగన్నాథ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మైసమ్మ చెరువులో స్నానం చేయడానికి దిగిన పాలిటెక్నిక్ విద్యార్థి భూక్యా సాయి కిరణ్ గల్లంతయ్యా. మహబూబాబాద్ మం డలం రెగ్యాల గ్రామానికి చెందిన సాయికిర ణ్ కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు. ఎనిమిది మంది సహచరులతో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి మై సమ్మ చెరువులో స్నానమాచరించినందుకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయికిరణ్ చెరువులో మునిగిపోగా మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. సాయికిరణ్ ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు చెరువులో గాలింపు చేపట్టాయి.