calender_icon.png 3 February, 2026 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిచి రండి..

03-02-2026 12:42:15 AM

చేవెళ్ల మున్సిపల్ బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫాంలు

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అందజేత

చేవెళ్ళ, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగార మోగిన నేపథ్యంలో చేవెళ్ల మున్సిపాలిటీలోనీ 18వార్డుల్లో పోటీచేయనున్న బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ అందాయి. మండల పార్టీ అధ్యక్షతన జరిగినా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోనీ అట్లాస్ ఫంక్షన్ హాల్ లో అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ...అభ్యర్థులందరూ గెలిచి రావాలన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అభ్యర్థుల గెలిపిస్తాయిన్నారు. ఓటర్లకు ఉద్యమ పార్టీ ప్రస్థానాన్ని తెలుపుతూ... ప్రచారంలో ముందుకు సాగాలన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసే యువచనలో నాయకులు ఉన్నారన్నారు. ఆయన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి రాష్టానికి అగ్ర తాంబూలం అన్నారు.