calender_icon.png 3 February, 2026 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీ ప్రత్యేక గుర్తింపు

03-02-2026 12:42:01 AM

ఎకనామిక్ సర్వేలో మహిళా స్టార్టప్‌ల సాధికారతతో జాతీయ స్థాయికి తెలంగాణ మోడల్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న మహిళా సాధికారత విధానాలకు ఎకనామిక్ సర్వే నివేదికలో కీలక గుర్తింపు లభిం చింది. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఏర్పాటు చేసిన వీ దేశంలోనే ఒక వినూత్న, ప్రభావవంతమైన నమూనాగా సర్వే నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. స్టార్టప్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచడంలో వీ- పోషిస్తున్న పాత్రను ఎకనామిక్ సర్వే ప్రశంసించింది.

ఇంక్యుబేషన్, మెంటార్షిప్, నిధుల సమీకరణ, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాల్లో మహిళలకు సమగ్ర మద్దతు అందిస్తున్న సంస్థగా వీ-హబ్‌ను నివేదిక గుర్తించింది. మహిళలు ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి సృష్టికర్తలుగా ఎదగడమే వీ- లక్ష్యమని సర్వే నివేదిక స్పష్టం చేసింది. ఈ దిశగా వీ ద్వారా వేలాది మంది మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టినట్టు నివేదిక పే ర్కొంది. వీ- ప్రత్యేకతగా గ్రామీణ మ హిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను కూడా స్టార్టప్ వ్యవస్థలోకి తీసుకు వస్తున్న విధానాన్ని ఎకనామిక్ సర్వే ప్రస్తావించింది.

సంప్రదాయ నైపుణ్యాలను ఆధు నిక వ్యాపార అవకాశాలతో అనుసంధానించడం ద్వారా మహిళల ఆదాయ వద్ధికి వీ తోడ్పడుతోందని తెలిపింది. వీ లాంటి పబ్లిక్ భాగస్వామ్యాలు మహిళల వ్యాపార భాగస్వామ్యాన్ని పురోగతి వైపు నడిపిస్తున్నాయని ఎకనామిక్ సర్వే గుర్తించడం ఎంతో గర్వకారణం అని వీ సీఈవో సీతాపల్లచోల్లా అన్నారు. మహిళలు కేవలం భాగస్వాములు కాదు భారతదేశం వికసిత్ భారత్ 2047 ప్రయాణాన్ని ముందుకు నడిపించే శక్తివంతమైన ఎనేబులర్లు అని చెప్పారు.